breaking news
sulphuric acid
-
సల్ఫర్ ధర డబుల్.. భారత్‌కు సరికొత్త సంక్షోభం!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ఇప్పుడు భారత రైతుపై ప్రభావం చూపే పరిస్థితిని కల్పించాయి. యుద్ధాల కారణంగా చమురు, సహజవాయువు కేంద్రాలపై దాడులు పెరగడంతో సల్ఫర్ సరఫరా దెబ్బతింటోంది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు అవసరమైన నికెల్ ఉత్పత్తి కోసం సల్ఫ్యూరిక్ యాసిడ్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ రెండు పరిణామాలు కలిసి సల్ఫర్ ధరలను ఏడాది వ్యవధిలో దాదాపు రెట్టింపు చేశాయి.రైతు ఎరువులపై యుద్ధ ప్రభావంఈ ఏడాది ప్రారంభం నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న సల్ఫర్ ధర దాదాపు రెట్టింపై టన్నుకు 1,050–1,100 డాలర్లకు చేరింది. సరుకు ధర, సముద్ర రవాణా ఖర్చులు కలిపిన ధర ఇది. సల్ఫర్ కొరత, అధిక ధరలు , కీలక ఎరువుల లభ్యతపై ప్రభావం చూపుతున్నాయి. యూరియా విషయంలో అవసరమైన దిగుమతులు చేపట్టడం ద్వారా భారత్ తాత్కాలికంగా ఆందోళనను తగ్గించుకున్నప్పటికీ, సల్ఫర్ ఇప్పుడు మరో కీలక సవాలుగా మారింది.సల్ఫర్ ఎక్కడి నుంచి వస్తుంది?ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే సల్ఫర్‌లో కేవలం 10 శాతం మాత్రమే నేరుగా గనుల నుంచి లభిస్తుంది. మిగిలిన దాంట్లో సుమారు 56 శాతం పెట్రోలియం శుద్ధి ప్రక్రియ నుంచి, మరో 34 శాతం సహజవాయువు ప్రాసెసింగ్ ద్వారా లభిస్తుంది. ముడి చమురు, గ్యాస్ నుంచి సల్ఫర్‌ను తొలగించడం పర్యావరణ నిబంధనల ప్రకారం అవసరం. ఈ ప్రక్రియను ‘డీసల్ఫరైజేషన్’ అంటారు. ఇందులో వెలువడే సల్ఫర్‌ను ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. అందువల్ల చమురు, గ్యాస్ మౌలిక వసతులపై దాడులు జరిగితే సల్ఫర్ సరఫరాపైనా ప్రభావం పడుతుంది.సల్ఫర్ ఎందుకంత కీలకం?ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 7 కోట్ల టన్నుల సల్ఫర్ వినియోగం జరుగుతోంది. అందులో సుమారు 60 శాతం ఎరువుల పరిశ్రమకే వెళ్తుంది. సల్ఫర్‌లో ఎక్కువ భాగాన్ని ముందుగా సల్ఫ్యూరిక్ యాసిడ్‌గా మారుస్తారు. ఫాస్ఫరస్ ఆధారిత ఎరువుల తయారీలో ఈ యాసిడ్ కీలకం. గనుల నుంచి లభించే రాక్ ఫాస్ఫేట్ను మొక్కలు గ్రహించగల రూపంలోకి మార్చడానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ అవసరం. అందువల్ల సల్ఫర్ లేకపోతే డీఏపీ, ఎస్ఎస్పీ వంటి మిశ్రమ ఎరువుల తయారీకి ఆటంకాలు ఏర్పడతాయి.ఒకప్పుడు వ్యర్థం.. ఇప్పుడు బంగారమైంది!సల్ఫర్‌కు సంబంధించిన ధరల చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంది. భారత్ ఏటా సుమారు 38–39 లక్షల టన్నుల సల్ఫర్ వినియోగిస్తుండగా, అందులో 20–21 లక్షల టన్నులు ఎరువుల పరిశ్రమకు అవసరం. చమురు, గ్యాస్ పరిశ్రమలో ఇది ఉప ఉత్పత్తిగా లభించడం వల్ల గతంలో చాలా చౌకగా ఉండేది. ఒక దశలో టన్ను ధర 200 డాలర్ల కంటే తక్కువగా ఉండేది. 2019–20లో కొన్ని నెలల్లో 100 డాలర్ల కంటే కూడా దిగువకు వెళ్లింది. 2020లో జపాన్, దక్షిణ కొరియాలోని కొన్ని లోహ పరిశ్రమల నుంచి భారత్ టన్నుకు మైనస్ 20 డాలర్లకే సల్ఫర్ తెచ్చుకున్న సందర్భం కూడా ఉంది. అయితే 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ధరలు 400–500 డాలర్లకు చేరాయి. 2022 చివరి నుంచి 2025 ప్రారంభం వరకు మళ్లీ 200 డాలర్ల కంటే దిగువకు వచ్చినా, 2025 ఆగస్టు నుంచి పరిస్థితి మారింది. రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు పెరగడంతో డిసెంబర్ నాటికి ధర 500 డాలర్లను దాటింది. అనంతరం పశ్చిమాసియా ఘర్షణలతో మరింత పెరిగింది.ఈవీ బ్యాటరీల డిమాండ్‌తో..సల్ఫర్ ధర పెరగడానికి యుద్ధాలే ఏకైక కారణం కాదు. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు అవసరమైన నికెల్ ఉత్పత్తి కూడా దీనిపై ప్రభావం చూపుతోంది. నికెల్‌ను లేటరైట్ ఖనిజం నుంచి వెలికితీసి బ్యాటరీలకు అనువైన రూపంలోకి మార్చే ప్రక్రియలో సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను భారీగా ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో ఏర్పడే ఎంహెచ్పీ(మిక్స్డ్ హైడ్రాక్సైడ్ ప్రెసిపిటేట్) ఈవీ బ్యాటరీల్లో ఉపయోగపడుతుంది. నికెల్ కోసం సల్ఫ్యూరిక్ యాసిడ్ డిమాండ్ 2021లో 35 లక్షల టన్నుల నుంచి 2025లో 1.5 కోట్ల టన్నులకు పైగా పెరిగింది. ఇందులో ఇండోనేషియా కీలక పాత్ర పోషిస్తోంది. అదే సమయంలో రష్యా ఎరువుల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తూ సల్ఫర్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎగుమతులను నిలిపివేయగా, చైనా కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది.భారత్‌కు ఎంత పెద్ద సవాలు?భారత ఎరువుల కంపెనీలు దేశీయ చమురు శుద్ధి కేంద్రాల నుంచి కొంత సల్ఫర్‌ను పొందుతున్నప్పటికీ, అవసరాల్లో ఎక్కువ భాగం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఇఫ్కో, కోరమాండల్ ఇంటర్నేషనల్, పారాదీప్ ఫాస్ఫేట్స్ వంటి సంస్థలకు సమీకృత తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఇవి సల్ఫర్, రాక్ ఫాస్ఫేట్ను దిగుమతి చేసుకుని సల్ఫ్యూరిక్ యాసిడ్, ఫాస్ఫారిక్ యాసిడ్ ద్వారా డీఏపీ, ఎస్ఎస్పీ వంటి ఎరువులను తయారు చేస్తాయి. ఒక టన్ను సల్ఫర్‌తో సుమారు 3 టన్నుల సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారవుతుంది. భారత్‌కు 1.5–1.6 కోట్ల టన్నుల ఫాస్ఫేట్ ఎరువుల తయారీకి 43–45 లక్షల టన్నుల ఫాస్ఫారిక్ యాసిడ్ అవసరం కాగా, దేశీయ ఉత్పత్తి సామర్థ్యం సుమారు 22 లక్షల టన్నులే. జోర్డాన్, సెనెగల్, మొరాకోలో భాగస్వామ్యాల ద్వారా రాక్ ఫాస్ఫేట్ సరఫరాను కంపెనీలు సమకూర్చుకున్నప్పటికీ, సల్ఫర్ లేకుండా దాన్ని ఎరువుగా మార్చడం సాధ్యం కాదు. ఇదీ చదవండి: నోయిడా నిరసనలు: చదువులు, ఉద్యోగాలకు దూరమైన ‘జెన్ జీ’ -
జనహితం కోరుతూ జెన్కో అడుగులు
సాక్షి, అమరావతి: వెలుగులు పంచే థర్మల్ విద్యుత్ కేంద్రాలు మరోపక్క విషవాయువులను వెదజల్లుతున్నాయి. దీన్ని తక్షణమే అదుపు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ముఖ్యంగా ఆమ్ల వాయువుల (సల్ఫ్యూరిక్ యాసిడ్) నియంత్రణ తప్పనిసరి చేసింది. వాస్తవానికి 2015లో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికే అమలు కావాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వం థర్మల్ ప్లాంట్లలో ప్లూగ్యాస్ డీ సల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) ప్రక్రియపై దృష్టి పెట్టలేదు. పర్యావరణానికి చేటు తెస్తున్న ఆమ్ల వాయువుల నియంత్రణపై ప్రస్తుత సర్కారు వేగంగా అడుగులేస్తోంది. రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాల్లో ఎఫ్‌జీడీ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమైంది. సల్ఫర్‌తో చిక్కే..! రాష్ట్రంలో ఏపీ జెన్కో పరిధిలో 5 వేల మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. పూర్తి స్థాయిలో ఇవి విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే రోజుకు 70 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. బొగ్గును మండించినప్పుడు అందులోని నైట్రోజన్, సల్ఫర్ వంటి వాయువులు వెలువడతాయి. థర్మల్ కేంద్రాల నుంచి గాలిలోకి వెళ్లే వాయువుల్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ బొగ్గు వినియోగంలో పాయింట్ ఒక్క శాతం మాత్రమే ఉండాలి. పాత విద్యుత్ కేంద్రాల వల్ల ఇది ఆరు రెట్లు ఎక్కువ ఉంటోందని పర్యావరణ శాఖ చెబుతోంది. విదేశీ బొగ్గు వాడే కేంద్రాల్లో ఇది పది శాతం వరకూ ఎక్కువగా ఉంటోంది. ఆమ్ల వర్షాలకు సల్ఫ్యూరిక్ యాసిడే కారణం. దాదాపు 50 కి.మీ. పరిధిలో దీని ప్రభావం ఉంటుంది. పంటలకు హాని చేస్తుంది. ప్రాణాలను హరించే జబ్బులకూ కారణమవుతుంది. (చదవండి: ‘థర్మల్’కు డిమాండ్) ఎలా నియంత్రిస్తారు..? బొగ్గును బాయిలర్‌లో మండించటం వల్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ బయటకొస్తుంది. దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిమ్నీ ద్వారా భూమికి 100 అడుగులపైకి పంపి గాలిలో కలుపుతారు. అది భూమిని చేరేలోపు తీవ్రత తగ్గుతుంది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాలు అనుసరిస్తున్న విధానమిది. ఎఫ్‌జీడీ ప్రక్రియలో సున్నపురాయిని పొడిచేసి, నీళ్లతో కలిపి చిమ్నీపైకి పంపుతారు. రసాయన చర్య వల్ల సల్ఫర్ జిప్సమ్‌గా మారుతుంది. ఈ జిప్సమ్‌ను ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తారు. భారీ ఖర్చే..! ఎఫ్‌జీడీ ప్లాంట్ నిర్మించాలంటే ప్రతీ మెగావాట్‌కు రూ.50 లక్షలు ఖర్చు చేయాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ జెన్కో దశల వారీగా ఈ ప్రక్రియను చేపడుతోంది. ముందుగా నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం, కృష్ణపట్నం కేంద్రాల్లో ఎఫ్‌జీడీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. (చదవండి: ‘పవర్’ఫుల్ సెక్టార్) టెండర్లు పిలుస్తున్నాం: శ్రీధర్, ఎండీ, జెన్కో ‘ఎఫ్‌జీడీ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలుస్తున్నాం. ఇప్పటికే డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాం. పర్యావరణానికి ఏమాత్రం హాని లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో ఈ ప్లాంట్లను నిర్మించాలని చూస్తున్నాం’ అని జెన్కో ఎండీ శ్రీధర్ తెలిపారు. -
పొరపాటున యాసిడ్ తాగి..
ముంబయి: పొరపాటున యాసిడ్ తాగి ఆరు నెలల తర్వాత ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఓ బాలుడు. చాలా రోజుల తర్వాత హాయిగా పిజ్జాలు, బర్గర్లు లాగించడం మొదలుపెట్టాడు. ముంబయిలోని మిరా రోడ్డులోని కిండర్ గార్డెన్ స్కూల్లో రాజ్ వీర్ కనోజియా అనే నాలుగేళ్ల బాలుడు చదువుతున్నాడు. ఈ ఏడాది(2016) ఏప్రిల్ నెలలో కుటుంబమంతా తీర్థయాత్రకు వెళ్లాలని అన్ని సిద్ధం చేసుకుంది. బాలుడి తండ్రి సన్నీ ట్యాక్సీ డ్రైవర్ కావడంతో బ్యాటరీలో పోసే సల్ఫ్యూరిక్ యాసిడ్ బాటిల్ ను ఇంట్లో ఉంచాడు. అది చూడ్డానికి అచ్చం నీళ్లలాగే ఉండటంతో పొరపడిన రాజ్ వీర్ దానిని తాగేశాడు. దీంతో ఆస్పత్రి పాలైన ఆ బాలుడు చివరకు ఆరు నెలల తర్వాత కోలుకున్నాడు.


