లిబియాలో నలుగురు భారతీయుల కిడ్నాప్ | four indian teachers kidnapped in libya | Sakshi
Sakshi News home page

లిబియాలో నలుగురు భారతీయుల కిడ్నాప్

Jul 31 2015 10:38 AM | Updated on Sep 3 2017 6:31 AM

లిబియాలో నలుగురు భారతీయుల కిడ్నాప్

లిబియాలో నలుగురు భారతీయుల కిడ్నాప్

లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్కు గురయ్యారు. అపహరణకు గురైనవారంతా ట్రిపోలీ సమీపంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.

న్యూఢిల్లీ : లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్కు గురయ్యారు. ట్రిపోలీ సమీపంలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వీరంతా బుధవారం సాయంత్రం అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. కాగా కిడ్నాప్కు గురైన వారిలో ఇద్దరు తెలుగువారు కాగా, మరో ఇద్దరు కర్ణాటకకు చెందినవారు. తెలుగువారిలో హైదరాబాద్ కు చెందిన గోపీకృష్ణ, బలరామ్ గా గుర్తించారు.  అయితే కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్లు రాలేదని ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. కాగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులే ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. 

కాగా తమవారు కిడ్నాప్ అయిన వార్త తెలుసుకున్న బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తమవారిని క్షేమంగా విడిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement