వాజ్‌పేయి ఆరోగ్యం విషమం.. హుటాహుటిన ఎయిమ్స్‌కు మోదీ | Former PM Atal Bihari Vajpayee Health Critical Condition | Sakshi
Sakshi News home page

వాజ్‌పేయి ఆరోగ్యం విషమం.. హుటాహుటిన ఎయిమ్స్‌కు మోదీ

Aug 15 2018 6:31 PM | Updated on Jul 11 2019 8:38 PM

Former PM Atal Bihari Vajpayee  Health Critical Condition - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్యం విషమించింది. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలియడంతో ప్రధాని నరేంద్ర మోదీ హుటాహుటిన ఎయిమ్స్‌కు చేరుకున్నారు. వాజపేయి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి ప్రధాని మోదీ వైద్యులను వాకబు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో గంటలో వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్‌ బులెటిన్‌ను ఎయిమ్స్‌ వైద్యులు విడుదల చేయనున్నారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమించిందని తెలియడంతో బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ గురువారం చేపట్టబోయే తన అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుంది.

రేపు విజయవాడలో జరగాల్సిన బీజేపీ కార్యాలయ శంకుస్థాపన కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం వాజ్‌పేయి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఎయిమ్స్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న వాజ్‌పేయిని పరామర్శించారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సదుపాయలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మూత్ర సంబంధ సమస్యలతో బాధపడుతున్న వాజ్‌పేయి  జూన్‌ 12న  ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం వాజ్‌పేయి కిడ్నీ ఒక్కటే పనిచేస్తోంది. ఆయనకు డయాబెటిస్‌తోపాటు డిమెన్షియా ఉంది.  

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement