‘రాహుల్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు’ | FM Sitharaman Responds On Rahul Remark | Sakshi
Sakshi News home page

‘రాహుల్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు’

Dec 13 2019 5:08 PM | Updated on Dec 13 2019 8:06 PM

FM Sitharaman Responds On Rahul Remark - Sakshi

 రాహుల్‌ మేకిన్‌ ఇండియా వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు.

సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడులపై మేకిన్‌ ఇండియాను ఉటంకిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. రాహుల్‌ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆందోళన వ్యక్తం చేశారు. తాము మహిళల గౌరవం గురించి మాట్లాడుతుంటే రాహుల్‌ చౌకబారు వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ తరచూ మేకిన్‌ ఇండియా గురించి చెబుతుంటారని అయితే దేశంలో పరిస్థితి మాత్రం రేపిన్‌ ఇండియాగా మారిందని జార్ఖండ్‌ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. రాహుల్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని పార్లమెంట్‌లో పాలక పక్ష సభ్యులు డిమాండ్‌ చేయగా క్షమాపణ చెప్పేది లేదని రాహుల్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement