కోర్టులో కాల్పులు : పోలీస్ కానిస్టేబుల్ మృతి | Firing inside Karkardooma court in Delhi; cop injured | Sakshi
Sakshi News home page

కోర్టులో కాల్పులు : పోలీస్ కానిస్టేబుల్ మృతి

Dec 23 2015 12:21 PM | Updated on Oct 2 2018 2:30 PM

న్యూఢిల్లీలోని కర్కర్దుమా కోర్టు హాల్లో బుధవారం ఆగంతకులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు.

న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని కర్కర్దుమా కోర్టు హాల్లో బుధవారం ఆగంతకులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు. ఈ కాల్పుల్లో గాయపడని మరోక వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం దేశ రాజధాని న్యూఢిల్లీలోని కర్కర్దుమా కోర్టులోకి తుపాకులతో ఐదుగురు ఆగంతకులు ప్రవేశించారు. అనంతరం న్యాయమూర్తి ఎదురుగానే విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో పోలీస్ కానిస్టేబుల్తోపాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల శబ్దానికి కోర్టులోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. అక్కడే ఉన్న భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై.... కాల్పులు జరిపిన వారిలో ఇద్దరు ఆగంతకులను పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించి విచారిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి... పట్టుబడిన ఇద్దరు నిందితులను తమదైన శైలిలో విచారిస్తున్నారు. పరారైన ఆగంతకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement