breaking news
cop injured
-
ఉగ్రవాదుల కాల్పులు: పోలీసు మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. పుల్వామా జిల్లాలో జరగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. -
కోర్టులో కాల్పులు : పోలీస్ కానిస్టేబుల్ మృతి
న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని కర్కర్దుమా కోర్టు హాల్లో బుధవారం ఆగంతకులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు. ఈ కాల్పుల్లో గాయపడని మరోక వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం దేశ రాజధాని న్యూఢిల్లీలోని కర్కర్దుమా కోర్టులోకి తుపాకులతో ఐదుగురు ఆగంతకులు ప్రవేశించారు. అనంతరం న్యాయమూర్తి ఎదురుగానే విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పోలీస్ కానిస్టేబుల్‌తోపాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల శబ్దానికి కోర్టులోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. అక్కడే ఉన్న భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై.... కాల్పులు జరిపిన వారిలో ఇద్దరు ఆగంతకులను పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించి విచారిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి... పట్టుబడిన ఇద్దరు నిందితులను తమదైన శైలిలో విచారిస్తున్నారు. పరారైన ఆగంతకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.