బిగ్‌ బజార్‌లో అగ్నిప్రమాదం

Fire Breaks Out At Big Bazaar Store In Matunga Mumbai - Sakshi

ముంబై: ముంబై మతుంగలోని బిగ్‌ బజార్‌ స్టోర్‌లో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసకుంది. సాయంత్రం ఐదు గంటల సమయంలో స్టోర్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. తర్వాత అవి వేగంగా వ్యాపించాయి. మంటల కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు ఆలుముకున్నాయి. వెంటనే రంగంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు ఐదు ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకున్నాయి. అయితే అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో స్టోర్‌ లోపల ఉన్న వారందరిని బయటకు తరలించినట్టుగా సమాచారం. అగ్నిప్రమాదం కారణంగా ఆ మార్గంలో పోలీసులు ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top