‘రీడర్స్ డెజైస్ట్’కు రూ.5 లక్షల జరిమానా | Fine of Rs 5 lakh to "Readers dejaist ' | Sakshi
Sakshi News home page

‘రీడర్స్ డెజైస్ట్’కు రూ.5 లక్షల జరిమానా

Dec 7 2016 1:17 AM | Updated on Sep 4 2017 10:04 PM

మోసపూరిత పోటీలతో తన అమ్మకాలను పెంచుకునేందుకు యత్నించిన ‘రీడర్స్ డెజైస్ట్’అనే మేగజీన్‌పై ఢిల్లీ వినియోగదారుల కమిషన్ కొరడా ఝళిపించింది.

న్యూఢిల్లీ: మోసపూరిత పోటీలతో తన అమ్మకాలను పెంచుకునేందుకు యత్నించిన ‘రీడర్స్ డెజైస్ట్’అనే మేగజీన్‌పై ఢిల్లీ వినియోగదారుల కమిషన్ కొరడా ఝళిపించింది. మేగజీన్‌కు వ్యతిరేకంగా కేసు వేసిన మైసూరుకు చెందిన బాలమ్మ అనే 86 ఏళ్ల వృద్ధురాలికి రూ.5 లక్షలు చెల్లించడంతోపాటు, కనువిప్పు కలిగేలా మరో రూ.50 లక్షలను వినియోగదారుల సంక్షేమ నిధి వద్ద డిపాజిట్ చేయాలని మేగజీన్‌ను ఆదేశించింది.

తాము ఒక పోటీని నిర్వహిస్తున్నామనీ, అందులో గెలిచిన వారికి రూ.24 లక్షల డబ్బు, ఒక విలాసవంతమైన కారు బహుమతిగా అందజేస్తామని మేగజీన్ ఇచ్చిన మోసపూరిత ప్రకటనపై బాలమ్మ ఫిర్యాదుచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement