పెంపుడు కుక్కకు దశదిన కర్మ | Family mourns pet's death as per traditional Hindu custom | Sakshi
Sakshi News home page

పెంపుడు కుక్కకు దశదిన కర్మ

May 27 2015 8:00 PM | Updated on Sep 3 2017 2:47 AM

కుక్క (ఆడజాతి)ను ఎంతో ప్రేమతో పెంచుకుని కూతురిలా చూసుకున్నారు.

ఇండోర్: కుక్క (ఆడజాతి)ను ఎంతో ప్రేమతో పెంచుకుని కూతురిలా చూసుకున్నారు. ఈ పెంపుడు కుక్క చనిపోతే ఇంట్లో వ్యక్తి చనిపోయినట్టు బాధపడ్డారు. హిందూ సాంప్రదాయం ప్రకారం కుక్కకు అంత్యక్రియలు నిర్వహించి, దశదిన కర్మ చేయించారు. సన్నిహితులను పిలిచి 500 మందికి భోజనాలు పెట్టారు. అంతేగాక ఆ ఇంటి యజమాని కుమారుడు సాంప్రదాయం ప్రకారం క్షవరం చేయించుకుని నివాళులు అర్పించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది.  

పప్పు చౌహాన్కు జర్మన్ షెపర్డ్ పింకీని పెంచుకున్నారు. చౌహాన్ దంపతులకు ఇద్దరు కుమారులుండగా, ఈ కుక్కను కూతురిలా చూసుకున్నారు. కాగా పక్షవాతంతో ఆ కుక్క ఇటీవల మరణించడంతో చౌహాన్ కుటుంబం ఎంతో బాధపడింది. హిందూ సాంప్రదాయం ప్రకారం కుక్కకు తుది సంస్కారాలు నిర్వహించి నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement