బీమా బిల్లు వంటి కీలక బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందుతాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: బీమా బిల్లు వంటి కీలక బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందుతాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. శీతాకాల సమావేశాలను పొడిగించే అవకాశాలున్నాయా? అని విలేకర్లు అడగ్గా పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం భేటీ అవుతోందని, అక్కడ పరిస్థితిని సమీక్షించి, శీతాకాల సమావేశాలను పొడిగించే విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.
స్థాయీ సంఘానికి ‘లోక్‌పాల్ సవరణ’
లోక్‌పాల్-లోకాయుక్తల చట్ట సవరణ బిల్లును సోమవారం లోక్‌సభ పార్లమెంట్ స్థాయీ సంఘానికి పంపింది. లోక్‌సభలోని అతిపెద్ద ప్రతిపక్ష నేతకు లోక్‌పాల్ చైర్‌పర్సన్, సభ్యులను ఎంపిక చేసే కమిటీలో చోటు కల్పించేందుకు, ఇతర సవరణలకు దీన్ని ప్రతిపాదించారు.