‘625 టన్నుల కొత్త నోట్ల రవాణా’

Ex-Air Chief On How IAF Helped Transport New Notes After Demonetisation - Sakshi

ముంబై: 2016లో నోట్ల రద్దు తర్వాత వాయుసేనకు చెందిన విమానాల్లో 625 టన్నుల బరువు గల కొత్త కరెన్సీ నోట్లను రవాణా చేసినట్లు వాయుసేన మాజీ చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా పేర్కొన్నారు. శనివారం ఐఐటీ–బాంబేలో జరిగిన ఓ టెక్‌ ఫెస్ట్‌లో ఆయన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అంతర్గత సేవల్లో భాగంగా 625 టన్నుల కొత్త కరెన్సీ నోట్లను రవాణా చేయడానికి 33 మిషన్లు నిర్వహించామన్నారు. 2016, నవంబర్‌ 8న పాత 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘నోట్ల రద్దు సమయంలో కొత్త కరెన్సీ నోట్లను వాయుసేన రవాణా చేసింది. కోటి రూపాయలకు 20 కేజీల బ్యాగ్‌ ఉపయోగించామ’ని బీఎస్‌ ధనోవా అన్నారు. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం గురించి మాట్లాడుతూ ఇలాంటి వివాదాలు ఆయుధాల సేకరణపై ప్రభావం చూపుతాయన్నారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top