జకీర్‌ నాయక్‌పై ఈడీ చార్జిషీట్‌

ED files charge sheet against Zakir Naik in Mumbai - Sakshi

న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్‌ నాయక్‌పై ఈసీ తొలిసారిగా నేరుగా అభియోగపత్రం దాఖలుచేసింది. రూ. 193 కోట్ల నల్లధనాన్ని జకీర్‌ నాయక్‌ అక్రమంగా రవాణా చేశారనీ, అలాగే భారత్‌తోపాటు ఇతర దేశాల్లోనూ అక్రమంగా స్థిరాస్తులను సంపాదించారని జకీర్‌ నాయక్‌పై ఈడీ అభియోగాలు మోపింది. అలాగే నాయక్‌ చేసిన పలు ద్వేష ప్రసంగాల వల్ల అనేకమంది ముస్లిం యవకులు చట్టవ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడటం, ఉగ్రవాదులుగా మారడం జరిగిందని ఈడీ పేర్కొంది. జకీర్‌ ఆలోచనల వల్ల సమాజంలోని వివిధ మతాల ప్రజల మధ్య సామరస్యం దెబ్బతిన్నదనీ, వారి మధ్య విద్వేషం రగిలిందని ఈడీ తెలిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top