బ్రెయిన్‌ ట్యూమర్‌ కారణంగా భారీగా ఎదిగిన యువకుడు

Due To Rare Brain Tumour 16 Year Old Who Grew To 7 Feet 4 Inches - Sakshi

డెహ్రడూన్‌ : సాధరణంగా ఇంటర్‌ చదివే కుర్రాడు అంటే.. 5 - 5.5 అడుగులు ఎత్తు.. ఎక్కడో ఓ చోట కొందరు 6 అడుగులు ఎత్తుతో.. ఓ మోస్తరు బరువుతో ఉంటారు. కానీ ఉత్తరాఖండ్‌కు చెందిన మోహన్‌ సింగ్‌ మాత్రం ఏకంగా ఏడున్నర అడుగుల ఎత్తుతో.. 113 కిలోగ్రాముల బరువుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కొడుకు భారీగా ఎదగడాన్ని చూసి సంతోషించిన తల్లుదండ్రులు అందుకు బ్రెయన్‌ ట్యూమర్‌ కారణం అని తెలిశాక ఆశ్చర్యపోతున్నారు. మోహన్‌ సింగ్‌ తలలో ఏర్పడిన ఓ ట్యూమర్‌ వల్ల అతను ఇంత భారీగా పెరిగాడని వైద్యులు నిర్థారించారు. ఆపరేషన్‌ చేసి ట్యూమర్‌ని తొలగించారు.

ఈ సందర్భంగా మోహన్‌ సింగ్‌ తండ్రి మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు మోహన్‌ కూడా అందరి పిల్లలానే సాధరణ ఎత్తు బరువుతో ఆరోగ్యంగా ఉండేవాడు. కానీ ఓ ఐదేళ్ల నుంచి అతని శరీరాకృతిలో విపరీమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అనూహ్యంగా ఎత్తు, బరువు పెరగడం ప్రారంభించాడు. ఇంటర్‌కు వచ్చే సరికి అతని ఎత్తు 7.4 అడుగులు కాగా బరువు 113 కిలోగ్రాములు. 4ఎక్స్‌ఎల్‌ సైజు దుస్తులు అతనికి సరిపోయేవి. చెప్పులు ప్రత్యేకంగా డిజైన్‌ చేయించే వాళ్లం. మంచం కూడా ప్రత్యేకంగా తయారు చేయించాం. ఈ ఐదేళ్లలో మోహన్‌ ఎక్కడికివెళ్తే అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవాడు. జనాలు అతనితో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడేవారు’ అన్నారు.

‘మేం కూడా అతను సాధరణంగానే ఎత్తు పెరుగుతున్నాడనుకున్నాం. కానీ ఓ ఐదు నెలలుగా మోహన్‌ విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. దాంతో లోకల్‌ వైద్యుల దగ్గరకి తీసుకెళ్లాం. వారు ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్‌ చేయించాల్సిందిగా సూచించారు. స్కానింగ్‌ రిపోర్టులో మోహన్‌ తలలో ఓ ట్యూమర్‌ ఏర్పడిందని వచ్చింది. దాంతో వారు ఎయిమ్స్‌కు తీసుకెళ్లమని సూచించారు. మోహన్‌ రిపోర్టులు పరిశీలించిన ఎయిమ్స్‌ వైద్యులు అతని పిట్యూటరి ‍గ్రంథికి ట్యూమర్‌ వచ్చిందని.. ఫలితంగానే ఇంత ఎత్తు, బరువు పెరిగాడని తెలిపారు. ఎండోస్కోపిక్‌ సర్జరీ ద్వారా ట్యూమర్‌ని పూర్తిగా తొలగించవచ్చని పేర్కొన్నారు. ఫలితంగా కొద్ది రోజుల్లోనే మోహన్‌ బరువు తగ్గుతాడని.. కానీ ఎత్తు మాత్రం అలానే ఉంటాడని తెలిపారు’ అన్నాడు.

మోహన్‌కు సర్జరీ చేసిన వైద్యులు మాట్లాడుతూ.. ‘ఇది జన్యు సంబంధిత సమస్య కాదు. పెరుగుదల హర్మోన్లలో వచ్చే లోపం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.ముగ్గురు వైద్యులు దాదాపు మూడు గంటల పాటు ‍శ్రమించి ఈ ట్యూమర్‌ని తొలగించారు’ అని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top