డీఎస్సీ-98 కేసు విచారణ ఆగస్టుకు వాయిదా | DSC-98, Teachers recruitments extended to August | Sakshi
Sakshi News home page

డీఎస్సీ-98 కేసు విచారణ ఆగస్టుకు వాయిదా

Apr 11 2015 1:18 AM | Updated on Sep 3 2017 12:07 AM

ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో 1998లో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన కేసు విచారణను సుప్రీంకోర్టు ఆగస్టుకు వాయిదా వేసింది.

సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో 1998లో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన కేసు విచారణను సుప్రీంకోర్టు ఆగస్టుకు వాయిదా వేసింది. శుక్రవారం జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు రాగా.. ఆగస్టులో ఈ కేసు తుది విచారణ చేపడతామంటూ ధర్మాసనం వాయిదా వేసింది.

డీఎస్సీ-98లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, అగ్రశ్రేణిలో తమను కాదని, వెనక ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారని, వీటిపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్, హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలుచేయలేదని గోపు మహేందర్‌రెడ్డి, బాధిత అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement