మలినాలతో పాతఢిల్లీవాసులు విసిగిపోయారు | Dr Harsh Vardhan leads cleanliness drive in Turkman Gate | Sakshi
Sakshi News home page

మలినాలతో పాతఢిల్లీవాసులు విసిగిపోయారు

Oct 6 2014 10:37 PM | Updated on Aug 15 2018 2:20 PM

మలినాల మధ్య కాలం గడపలేక పాత ఢిల్లీవాసులు విసిగిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: మలినాల మధ్య కాలం గడపలేక పాత ఢిల్లీవాసులు విసిగిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. అందువల్లనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరంభించిన ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ చక్కగా ప్రతిస్పందించారన్నారు. నగరంంలోని చాందినీ చౌక్ ప్రాంతంలో సోమవారం నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి కుడ్యనగరవాసులు చక్కగా స్పందించడాన్ని నేను గుర్తించాను. మలినాల మధ్య కాలం వెళ్లదీయలేక పాత ఢిల్లీవాసులు ఇప్పటికే బాగా విసిగిపోయారు. గడచిన రెండు దశాబ్దాల కాలంలో పాతఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో నేను పర్యటించా. ఈ సందర్భంగా అనేకమంది నగరవాసుల్లో పారిశుధ్యం ఆవశ్యకతపై స్ఫూర్తి కలిగించా.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ముందుకు రావాలని కోరా. ఈ ఆలోచన వారికి ఎంతగానో నచ్చింది’ అని అన్నారు. పారిశుధ్య కార్యక్రమం చేపట్టడానికి బక్రీద్ శుభదినమని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 తరచూ తనిఖీలు చేయండి
 పాత ఢిల్లీని తరచూ తనిఖీలు చేపట్టాలని మంత్రి హర్షవర్ధన్ ఆరోపించారు. ఈ ప్రాంతంలో మరిన్ని మరుగుదొడ్లను నిర్మించాలని సూచించారు. ప్రతిరోజూ వ్యర్థాలను తొలగించాలన్నారు. ఫటక్ తెలియాన్ ప్రాంతంలోని కమ్యూనిటీ హాలుకు మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనులపై అవసరమని భావిస్తే మరింత శ్రద్ధ చూపాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement