పేషెంటుకు మత్తిచ్చి.. నిద్రపోయిన డాక్టర్ | doctor gives anaesthesia to patients, falls asleep | Sakshi
Sakshi News home page

పేషెంటుకు మత్తిచ్చి.. నిద్రపోయిన డాక్టర్

Dec 12 2014 7:49 PM | Updated on Sep 2 2017 6:04 PM

రోగులకు ఆపరేషన్ చేయడానికి మత్తుమందు ఇచ్చిన ఓ డాక్టర్.. తానే నిద్ర పోయారు!

రోగులకు ఆపరేషన్ చేయడానికి మత్తుమందు ఇచ్చిన ఓ డాక్టర్.. తానే నిద్ర పోయారు! దాంతో ఆయనను వెంటనే సస్పెండ్ చేశారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో జరిగింది. ఆ డాక్టర్ను వెంటనే సస్పెండ్ చేసినట్లు హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కౌల్ సింగ్ ఠాకూర్ అసెంబ్లీలో తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు.

అదృష్టవశాత్తు ఆ మహిళలు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదని, అంతా ఆరోగ్యకరంగానే ఉన్నారని ఆయన చెప్పారు. ఈ నిర్వాకం చేసిన వైద్యుడికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, కొద్ది మోతాదులో అతడు మద్యం పుచ్చుకున్నట్లు తేలిందన్నారు. ఇలాంటి నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement