'డేరా' దమనకాండ.. ఉత్తరాది విలవిల | Dera Sacha Sauda followers run riot in Haryana, Punjab towns | Sakshi
Sakshi News home page

'డేరా' దమనకాండ.. ఉత్తరాది విలవిల

Aug 25 2017 7:26 PM | Updated on Sep 12 2017 1:00 AM

రేప్‌ కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ను కోర్టు దోషిగా తేల్చిన తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో హింస పెచ్చరిల్లింది.

చండీగఢ్‌: రేప్‌ కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ను కోర్టు దోషిగా తేల్చిన తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో హింస పెచ్చరిల్లింది. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో తలెత్తిన ఘర్షణల్లో 31 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. హర్యానాలోని పంచకులలో చిన్నారితో సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పు వెలువరించగానే గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ మద్దతుదారులు హింస, విధ్వంసాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. మీడియా వాహనాలు, ప్రతినిధులపైనా ప్రతాపం చూపించారు.

హర్యానాలో రెండు రైల్వే స్టేషన్లు, పవర్‌గ్రిడ్‌, పెట్రోల్‌ పంప్‌నకు నిప్పుపెట్టారు. ఢిల్లీలోనూ నిరసనకారులు విధ్వంసాలకు దిగారు. ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో రైలు, రెండు బస్సులను దగ్ధం చేశారు. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో నిరసనకారులు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ కార్యాలయానికి నిప్పు పెట్టారు. పంచకులతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 17 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు గుర్మీత్‌ను హెలికాఫ్టర్‌లో రోహతక్‌కు తరలించారు. అల్లర్లకు పాల్పడిన 1000 డేరా సచ్చా సౌదా కార్యకర్తలకు అదుపులోకి తీసుకున్నట్టు హర్యానా అదనపు డీజీపీ మహ్మద్‌ ఆకిల్‌ తెలిపారు. డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయం ఉన్న సిర్సాకు అదనపు భద్రతా దళాలను తరలించారు. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాతో పాటు పలు జిల్లాల్లో 144 సెక్షన్‌ అమల్లోకి తెచ్చారు. దేశ రాజధాని ఢిల్లిలోనూ భద్రతను పెంచారు. తమ రాష్ట్రానికి మరిన్ని బలగాలు పంపాలని కేంద్రాన్ని పంజాబ్‌ ప్రభుత్వం కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement