కార్తీ మరో రూ. 10 కోట్లు కట్టి వెళ్లండి.. | deposit Rs 10 crore, then go abroad, supreme court tells Karti Chidambaram | Sakshi
Sakshi News home page

కార్తీ మరో రూ. 10 కోట్లు కట్టి వెళ్లండి..

May 8 2019 8:00 AM | Updated on Jun 4 2019 6:47 PM

deposit Rs 10 crore, then go abroad, supreme court tells Karti Chidambaram  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పి.చిదంబరం కొడుకు కార్తీకి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. మే, జూన్‌ నెలల మధ్యలో ఆయన విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. గతంలోవి కాకుండా పూచీకత్తు కింద మరో రూ.10 కోట్లు డిపాజిట్‌ చేయాలని సీజేఐ జస్టిస్‌ గొగోయ్, జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల బెంచ్‌ కార్తీని ఆదేశించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా, ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులకు సంబంధించి సీబీఐ, ఈడీ సంస్థలు ప్రస్తుతం కార్తీని విచారిస్తున్నాయి. అయితే టోటస్‌ టెన్నిస్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ల కోసం తాను అమెరికా, జర్మనీ, స్పెయిన్‌ దేశాలకు వెళ్లాల్సి ఉందని కోర్టుకు కార్తీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement