‘హోలీ కూడా జరుపుకోనివ్వరా.. బయటకు నో’ | Delhi University Hostels Bar Girls From Stepping Out on Holi | Sakshi
Sakshi News home page

‘హోలీ కూడా జరుపుకోనివ్వరా.. బయటకు నో’

Mar 12 2017 9:46 AM | Updated on Sep 5 2017 5:54 AM

‘హోలీ కూడా జరుపుకోనివ్వరా.. బయటకు నో’

‘హోలీ కూడా జరుపుకోనివ్వరా.. బయటకు నో’

ఢిల్లీ యూనివర్సిటీలో కొత్త వివాదం రాజుకుంది. యువత ఎంతో సంబురంగా జరుపుకునే హోలీలో తమను పాల్గొనకుండా అడ్డుకున్నారంటూ ఢిల్లీ వర్సిటీ యువతులు వర్సిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో కొత్త వివాదం రాజుకుంది. యువత ఎంతో సంబురంగా జరుపుకునే హోలీలో తమను పాల్గొనకుండా అడ్డుకున్నారంటూ ఢిల్లీ వర్సిటీ యువతులు వర్సిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిరంకుశత్వ చర్య అని, తమ స్వేచ్ఛను అడ్డుకోవడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ పాలన వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఢిల్లీ యూనివర్సిటీ మహిళల అంతర్జాతీయ విద్యార్థుల వసతి గృహ(ఐఎస్‌హెచ్‌డబ్ల్యూ) అధికారులు మాత్రం విద్యార్థినుల మంచి కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది.

‘వర్సిటీలో ఉంటున్నవారు బయటకు వెళ్లేందుకుగానీ, బయట నుంచి అతిథులుగా వచ్చే మహిళా స్నేహితులు లోపలికి వచ్చేందుకుగానీ మార్చి 12 రాత్రి 9గంటల నుంచి మార్చి 13 సాయంత్రం 6గంటల వరకు నిషేధం. మార్చి 12 రాత్రి ఆలస్యంగా వచ్చినవారికి లోపలికి అనుమతి ఉండదు. కేవలం హాస్టల్‌ గదుల ముందు ప్రాంగణంలో మాత్రమే హోలీ ఆడుకునేందుకు అనుమతిస్తున్నాం’ అని ఐఎస్‌హెచ్‌డబ్ల్యూ ఒక నోటీసులో తెలిపింది. దీనిపై వర్సిటీ విద్యార్థునులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement