సూపర్‌ సుకృతి!! | Delhi Sukriti Gupta tops CBSE Class 12 exams | Sakshi
Sakshi News home page

సూపర్‌ సుకృతి!!

May 21 2016 3:38 PM | Updated on Sep 4 2017 12:37 AM

సూపర్‌ సుకృతి!!

సూపర్‌ సుకృతి!!

న్యూఢిల్లీలోని మాంట్‌ఫ్రంట్‌ స్కూల్‌లో చదివిన సుకృతి గుప్తా క్లాస్‌-12 పరీక్షల్లో 99.4శాతం స్కోరు సాధించి ప్రతిభ చాటుకుంది.

న్యూఢిల్లీలోని మాంట్‌ఫ్రంట్‌ స్కూల్‌లో చదివిన సుకృతి గుప్తా క్లాస్‌-12 పరీక్షల్లో 99.4శాతం స్కోరు సాధించి ప్రతిభ చాటుకుంది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) శనివారం ప్రకటించిన ఫలితాల్లో సుకృతి టాప్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సొంతం చేసుకుంది.

సైన్స్ విద్యార్థిని అయిన ఆమెకు బోర్డ్ పరీక్షల్లో 500 మార్కులకుగాను 497 మార్కులు వచ్చాయి. గత ఏడాది ఢిల్లీలోని న్యూ గ్రీన్ ఫీల్డ్‌ స్కూల్ విద్యార్థిని కామర్స్ విభాగంలో 496 మార్కులు సాధించి టాపర్‌గా నిలించింది. సుకృతి ఫిజిక్స్‌, కెమెస్ట్రీ సబ్జెక్టుల్లో 100కు వందమార్కులు తెచ్చుకోగా, మాథ్య్స్‌, ఇంగ్లిష్‌, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో 99 మార్కుల చొప్పున తెచ్చుకుంది. ఆదివారం జరగనున్న జెఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామ్‌కు ప్రస్తుతం సుకృతి సిద్ధమవుతోంది. ఇక హర్యానాకు చెందిన పాలక్‌ గోయెల్‌ 496 మార్కులతో టాప్‌ సెంకండ్ ట్యాంకును సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement