'ట్విట్టర్‌ను ఆచితూచి వాడుకోండి' | Delhi Police chief tells department to use Twitter better | Sakshi
Sakshi News home page

'ట్విట్టర్‌ను ఆచితూచి వాడుకోండి'

Jun 19 2016 10:14 PM | Updated on Sep 4 2017 2:53 AM

'ట్విట్టర్‌ను ఆచితూచి వాడుకోండి'

'ట్విట్టర్‌ను ఆచితూచి వాడుకోండి'

ట్విట్టర్‌ను ఆచితూచి వాడుకోవాలంటూ పోలీసు అధికారులకు ఆదేశాలందాయి, పోలీసింగ్పై ఒపీనియన్ కోరడం, అందులో ఉంచిన వ్యాసాలను రీ ట్వీట్ చేయడం మానుకోవాలనేది ఉన్నతస్థాయివర్గాల ఆదేశం.

న్యూఢిల్లీ: ట్విట్టర్‌ను ఆచితూచి వాడుకోవాలంటూ పోలీసు అధికారులకు ఆదేశాలందాయి, పోలీసింగ్పై ఒపీనియన్ కోరడం, అందులో ఉంచిన వ్యాసాలను రీ ట్వీట్ చేయడం మానుకోవాలనేది ఉన్నతస్థాయివర్గాల ఆదేశం. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్ చీఫ్ అలోక్కుమార్ వర్మ వెల్లడించారు. ట్విట్టర్‌లో పోస్టులు పెట్టే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇటీవల జరిగిన ఓ హత్య కేసుకు మతం రంగు పులుముతూ పెట్టిన పోస్టుపై ఓ ఉన్నతాధికారికి ట్విట్టర్‌లో వివరణ ఇవ్వడంతో అందరిని దృష్టిని ఆకర్షించగలిగారు. దీనిపై ఉన్నతాధికారులు సదరు అధికారిపై ప్రశంసల జల్లు కురిపించారు. పోలీసు కమిషనర్గా బస్సీ వ్యవహరించిన సమయంలో ఆయనతోపాటూ ఏసీపీలు ట్వీటర్లో క్రియాశీలకంగా ఉండేవారు. సమాచారాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో బస్సీ అధికారులందరికీ ట్వీటర్లో ఖాతాలు ఉండేలా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement