ఆయుధాల కొనుగోలుకు 16 వేల కోట్లు | Sakshi
Sakshi News home page

ఆయుధాల కొనుగోలుకు 16 వేల కోట్లు

Published Tue, Feb 13 2018 7:44 PM

Defence Ministry allows purchase of 7.40 lakh assault rifles for Armed forces - Sakshi

న్యూఢిల్లీ: సాయుధ దళాల బలోపేతానికి రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.15,935 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలు, సేకరణకు పచ్చజెండా ఊపింది. రక్షణ శాఖలో అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునే రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) మంగళవారం ఈ మేరకు ఆమోదం తెలిపింది.

కొనుగోలు చేయనున్న ప్రతిపాదిత జాబితాలో 7.40 లక్షల రైఫిల్స్, 5719 స్నైపర్‌ రైఫిల్స్, మెషీన్‌ గన్స్‌ ఉన్నాయి.  సరిహదుల్లో పాక్, చైనాల నుంచి తీవ్ర సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. సుమారు రూ. 12,280 కోట్ల ఖర్చయ్యే రైఫిళ్లను ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో భారత్‌లో తయారుచేస్తారు. స్నైపర్‌ రైఫిళ్లను తొలుత విదేశాల నుంచి కొనుగోలు చేసి, తర్వాత భారత్‌లో తయారుచేస్తారు.

Advertisement
Advertisement