81కి చేరిన 'అస్సాం' మృతుల సంఖ్య | death toll rises to 81 angry adivasis retaliate | Sakshi
Sakshi News home page

81కి చేరిన 'అస్సాం' మృతుల సంఖ్య

Dec 27 2014 11:30 AM | Updated on Sep 2 2017 6:50 PM

బోడోలాండ్ మిలిటెంట్ల దాడిలో మృతుల సంఖ్య 81కు పెరిగింది.

అసోం: బోడోలాండ్ మిలిటెంట్ల దాడిలో  మృతుల సంఖ్య 81కు  పెరిగింది.  మృతుల్లో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. సోనిట్‌పూర్, కోక్రాఝర్, చిరాంగ్ జిల్లాల్లోని మారుమూల ఆదివాసీ గ్రామాలపై నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్డీఎఫ్‌బీ)కి చెందిన ఓ వర్గం మంగళవారం దాడి చేయడం తెలిసిందే. ఈ పరిస్థితులను సమీక్షించడానికి ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ అసోం వెళ్లనున్నారు.

 

గువహటి, సోనిట్‌పూర్, కోక్రాఝర్ లలో ఆర్మీ చీఫ్ పర్యటించనున్నారు. మిలిటెంట్ల దాడికి వ్యతిరేకంగా ఆందోళనలు పెరుగుతుండటంతో అదనపు బలగాలు కావాలని అస్సాం ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement