‘తొలి గురువు నానమ్మే’ | dadi indira Gandhi my mentor and guide | Sakshi
Sakshi News home page

‘తొలి గురువు నానమ్మే’

Nov 19 2017 5:53 PM | Updated on Nov 19 2017 8:34 PM

dadi indira Gandhi my mentor and guide - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నానమ్మే నా తొలి గురువు, నా మార్గదర్శి‘ అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదివారం ట్వీట్‌ చేశారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 100వ జయంతి సందర్భంగా రాహుల్‌గాంధీ ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. ‘దాదీ.. నీతో గడిపిన ఆనందక్షణాలు నాకింకా గుర్తున్నాయి’ అంటూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

ఆదివారం ఇందిరా గాంధీ వందవ జయంతి సందర్భంగా రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తదితరులు శక్తిస్థల్‌లోని ఇందిరాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.. ఇందిరాగాంధీతో సన్నిహింతగా ఉన్న ఒక ఫొటోనే ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement