మంత్రి దంపతులను దోచుకున్న దొంగలు | Dacoits loot finance minister, wife in train | Sakshi
Sakshi News home page

మంత్రి దంపతులను దోచుకున్న దొంగలు

Mar 19 2015 3:00 PM | Updated on Sep 2 2017 11:06 PM

మంత్రి దంపతులను దోచుకున్న దొంగలు

మంత్రి దంపతులను దోచుకున్న దొంగలు

జబల్పూర్- నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్-లో మంత్రి దంపతులను తుపాకీతో బెదిరించి దొంగలు దోచుకున్నారు.

మధురై:  జబల్పూర్- నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్-లో  ఓ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆయన భార్య దోపిడీకి గురయ్యారు. దోపిడీ దొంగలు మంత్రి దంపతులను  తుపాకీతో బెదిరించి మరీ దోచుకున్నారు.  ఈ సంఘటన రైళ్లలో ప్రయాణికుల భద్రత దుస్థితిని మరోసారి  వెలుగులోకి తెచ్చింది.  గురువారం  మధురై జిల్లాలోని కోసికోలన్ దగ్గర  జబల్పూర్- నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ క్లాస్  ఏసీ బోగీలోకి ఆయుధాలతో చొరబడ్డ దొంగలు మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి జయంత్ మలైయా దంపతులతో పాటు మరికొంతమంది ప్రయాణికులను  కూడా దోచుకున్నారు. 

అంతేకాదు ఇదే మార్గంలో వెళ్తున్న మరో రైలులో కూడా  ఈ గ్యాంగ్ లూటీకి పాల్పడినట్టు తెలుస్తోంది.  దీనిపై   పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  ఈ  సంఘటనతో షాకైన ఆర్థికమంత్రి జయంత్ .. దీనిపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభుని  కలవనున్నారని సమాచారం. గతంలో కోసి కలన్  రైల్వేమార్గాన్ని టార్గెట్ చేసుకొని ప్రయాణికులను దోచుకున్నఘటనలు అనేకం జరిగినట్టు తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement