తీర్పు ఇవ్వబోతున్నాం.. ఆదేశాలివ్వలేం | Court says it can't ask Salman to produce driving licence | Sakshi
Sakshi News home page

తీర్పు ఇవ్వబోతున్నాం.. ఆదేశాలివ్వలేం

Mar 3 2015 2:26 PM | Updated on Sep 2 2017 10:14 PM

హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్కు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చూపించాల్సిందిగా ఆదేశించాలంటూ వేసిన ఓ వ్యాజ్యాన్ని కోర్టు తోసిపుచ్చింది.

డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చూపించడంటూ తాము సల్మాన్ ఖాన్ను ఆదేశించలేమని సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలివ్వాలంటూ వేసిన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయని ఇలాంటి సమయంలో తాము ఎలాంటి ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. హిట్ అండ్ రన్ కేసు 2002లో నమోదైందని ఆ సమయంలో సల్మాన్కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, ఆయనకు లైసెన్స్ వచ్చిందే 2004లో అని ఆర్టీఏ రికార్డులో ఉందని ప్రదీప్ ఘారత్ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తాను వేసిన వ్యాజ్యంలో పేర్కొన్నారు.ఒకవేళ ఆ సమయంలో ఆయనకు లైసెన్స్ ఉందని నిరూపించుకోవాలనుకుంటే దానిని కోర్టుకు సమర్పించాల్సిందిగా ఆదేశించాలని కోరారు. దీనిపై మంగళవారం స్పందించిన సెషన్స్ కోర్టు ఇప్పటికే ఈ కేసులో వాదనలు గత నెల 27నే పూర్తయ్యాయని,ఇరువురి వాదనలు విన్నామని మంగళవారం తీర్పును వెలువరించాల్సి ఉన్నందున ఈ సమయంలో ఇక ఎలాంటి ఆదేశాలివ్వబోమని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఈ కేసులో నేడు తీర్పు వెల్లడించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement