
హోంగార్డు తిలోత్తమ మెహర్ విహారం ఏప్రిల్ 12న జరగాల్సి ఉంది. కానిస్టేబుల్ అధ వివాహం ఏప్రిల్ 25 న జరగాల్సి ఉంది.
భువనేశ్వర్: మందులేని మహమ్మారి కరోనా పోరులో ముందుండే పోలీసులు.. లాక్‌డౌన్ అమలుకై అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లల్లో కుంటుంబాలతో కలిసి ఉంటే.. పోలీసులు డ్యూటీలో తలమునకలయ్యారు. ఈక్రమంలో ఒడిశాకు చెందిన ఇద్దరు మహిళా పోలీసు సిబ్బంది తమ పెళ్లిని సైతం వాయిదా వేసుకున్నారు. విధి నిర్వహణకే మొగ్గుచూపారు. సుందర్‌గర్ జిల్లాకు చెందిన హోంగార్డు తిలోత్తమ మెహర్ విహారం ఏప్రిల్ 12న జరగాల్సి ఉంది. కానిస్టేబుల్ అధ వివాహం ఏప్రిల్ 25 న జరగాల్సి ఉంది. కరోనా క్లిష్ట సమయంలో విధులకే ఈ ఇద్దరూ ప్రాధాన్యమిచ్చారని రాష్ట్ర డీజీపీ అభయ్ వెల్లడించారు. ప్రజల మేలు కోసం వివాహాలు వాయిదా వేసుకున్నారని ప్రశంసించారు. ఒడిశా వ్యాప్తంగా ఎంతోమంది పోలీసు సిబ్బంది తమ ఇళ్లల్లో జరిగే శుభకార్యాలను వాయిదా వేసుకున్నారని డీజీపీ తెలిపారు.
(చదవండి: కరోనా: ఆరోగ్య సిబ్బంది మరణిస్తే రూ.50 లక్షలు)