24 గంటల్లో 10,667 కేసులు.. 380 మరణాలు | Coronavirus Latest Update In India 10667 New Positive Cases Registered | Sakshi
Sakshi News home page

24 గంటల్లో 10,667 కేసులు.. 380 మరణాలు

Jun 16 2020 10:28 AM | Updated on Jun 16 2020 12:54 PM

Coronavirus Latest Update In India 10667 New Positive Cases Registered - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,667 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 380 మంది మృత్యువాతపడ్డారు. కొత్త కేసులతో కలుపుకొని దేశంలో ఇప్పటివరకు 3,43,091 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,80,013 మంది మహమ్మారి కరోనా నుంచి కోలుకోగా.. 9,900 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1,53,178 కరోనా యాక్టీవ్‌ కేసులు దేశంలో ఉన్నాయి. (ప్రతి రోజు ల‌క్ష కేసులు: డ‌బ్ల్యూహెచ్ఓ)

ఇక ప్రపంచవ్యాప్తంగానూ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత రెండు వారాలుగా నిత్యం లక్ష కొత్త పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. మంగళవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 81.07 లక్షలకుపైగా చేరుకుంది. వైరస్‌ బారినపడి 4.38 లక్షల మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 41.87 లక్షల మంది కోలుకున్నారు. మరోవైపు న్యూజిలాండ్‌లో కొన్ని వారాల తర్వాత మళ్లీ కొత్త కేసులు నమోదుకావడం ఆ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement