కేంద్రం నిర్ణయం సరైనది కాదు : కేజ్రీవాల్‌

Coronavirus : Delhi Government Continue Lockdown without Relaxation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన లాక్‌డౌన్‌ సడలింపులను ఢిల్లీ ప్రభుత్వం పక్కన పెట్టింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉందని, అందుకే కేంద్ర ప్రభుత్వ సడలింపులను ఢిల్లీలో అమలు చేయబోమని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనల అమలు అన్ని ప్రాంతాల్లోను కొనసాగుతాయని వెల్లడించారు.

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుంటే.. ఆంక్షలు సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని కేజ్రీవాల్‌ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో వైరస్‌ వ్యాప్తి ఇంకా అదుపులోకి రానందున దుకాణాలను తెరిచే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 27న జరిగే ప్రధానమంత్రి వీడియో సమావేశంలో సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. 

 కాగా ఢిల్లీలో కరోనా పాజటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇపట్పి  వరకు కేసుల సంఖ్య  2,514కి చేరింది. ఢిల్లీలో 92కు పైగా కరోనా హాట్‌స్పాట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. గ్రీన్‌ జోన్‌ ప్రాంతాల్లో కూడా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్‌ అలర్ట్‌ ప్రకటించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top