కరోనాపై ఆందోళన అవసరం లేదు: ఢిల్లీ సీఎం

corona : 4 Steps Ahead Of Virus: Arvind Kejriwal   - Sakshi

శాశ్వత లాక్‌డౌన్  కొనసాగించలేం

భయపడాల్సిన అవసరం లేదు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా  వైరస్ విస్తరణపై భయపడాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన వైరస్ కట్టడికి ప్రభుత్వం నాలుగు దశల్లో కార్యక్రమాన్ని అమలు చేయబోతోందని ప్రకటించారు. ఢిల్లీలో కేసుల సంఖ్య భారీగా పెరిగిందని అంగీకరిస్తూనే.. చాలామంది ఇంట్లోనే కోలుకుంటున్నారు కనుక ఆందోళన చెందాల్సి అవసరం లేదంటూ హామీ ఇచ్చారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కాం కాదనీ, సుదీర్ఘ కాలం లాక్‌డౌన్ కొనసాగించలేమని ఆయన వెల్లడించారు.

మే14వ తేదీతో పోలిస్తే కరోనా వైరస్ బాధితుల సంఖ్య రెట్టింపు అయింది. 15 రోజుల్లో 8,500 కేసులు పెరిగాయి..ఇది ఆందోళన కలిగించే అంశమే. కానీ భయపడాల్సిన పనిలేదని కేజ్రీవాల్ తెలిపారు.  ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 500 మాత్రమేననీ, ఇంట్లోనే ఎక్కువ మంది కోలుకుంటున్నారన్నారు. అలాగే ఆసుపత్రిలో బెడ్ లకు ఎలాంటి కొరతలేదన్నారు. ప్రస్తుతం కేటాయించిన మొత్తం 6600 పడకల్లో 2100 రోగులున్నారని, మిగతావి అందుబాటులో ఉన్నాయన్నారు. జూన్ 5లోగా మరో 9,500 పడకలు సిద్ధంగా ఉంచుతామని కూడా సీఎం ప్రకటించారు. తాజా గణాంకాల ప్రకారం ఢిల్లీలో 17,386 కేసులు నమోదు  కాగా, 398 మంది మరణించారు. (రెమెడిసివిర్‌పై గిలియడ్ మరో కీలక అడుగు)

చదవండి : ఇక ఇంటి వద్దకే పెట్రోల్‌,సీఎన్‌జీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top