పోలీసుల దుశ్చర్య.. సీసీటీవీలో బుక్కు | Cop Thrashes Hotel Staff Over Food Bill | Sakshi
Sakshi News home page

పోలీసుల దుశ్చర్య.. సీసీటీవీలో బుక్కు

Sep 4 2017 3:44 PM | Updated on Oct 5 2018 6:36 PM

పోలీసుల దుశ్చర్య.. సీసీటీవీలో బుక్కు - Sakshi

పోలీసుల దుశ్చర్య.. సీసీటీవీలో బుక్కు

ఓ హోటల్‌లో పోలీసులు జులుం ప్రదర్శించారు. దర్జాగా బేర్‌ మంటూ తిని, తాగేసి బిల్లు విషయానికొచ్చేసరికి హోటల్‌ సిబ్బందిపై దాడి చేశారు.

థానే: ఓ హోటల్‌లో పోలీసులు జులుం ప్రదర్శించారు. దర్జాగా బేర్‌ మంటూ తిని, తాగేసి బిల్లు విషయానికొచ్చేసరికి హోటల్‌ సిబ్బందిపై దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తూ కిందపడేస్తూ సీసీటీవీ కెమెరాకు చిక్కారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. నెల రోజుల కిందట ముంబయిలో చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

'ఆరోజు మేం చేసిన తప్పేమిటంటే వారు తిన్న ఆహారానికి, తాగిన మద్యానికి బిల్లు వేసి ఇవ్వడమే. వారు ఆ రోజు ఎంత రచ్చ చేశారో సీసీటీవీ ఫుటేజీలో ఉంది. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. అయిన కేసు పెట్టలేదు' అని హోటల్‌లోని బాధితులు వాపోతున్నారు. కార్కెరా అనే పోలీసు అధికారి మరికొంతమంది పోలీసులతో తమ రెస్టారెంటుకు వచ్చాడని, అనంతరం మద్యం, ఆహారం ఆర్డర్‌ చేసి తిన్నారని చెప్పారు. ఎప్పుడు వచ్చినా సగం బిల్లే ఇచ్చి వెళుతుంటారని, అయినా తాము మాట్లాడబోమని, కానీ, ఆ రోజు రెండు వేల రూపాయల బిల్లు వచ్చిందని తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement