‘పప్పు(రాహుల్‌) విముక్త భారతే నా లక్ష్యం’ | Congressman Punished For WhatsApp Messages Has New Aim | Sakshi
Sakshi News home page

‘పప్పు(రాహుల్‌) విముక్త భారతే నా లక్ష్యం’

Jun 29 2017 6:14 PM | Updated on Mar 18 2019 9:02 PM

‘పప్పు(రాహుల్‌) విముక్త భారతే నా లక్ష్యం’ - Sakshi

‘పప్పు(రాహుల్‌) విముక్త భారతే నా లక్ష్యం’

కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని పప్పు అని పిలిచి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వినయ్‌ ప్రధాన్‌ అనే కాంగ్రెస్‌ పార్టీ నేత తాజాగా కాంగ్రెస్‌ను పూర్తిగా వదిలేశారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని పప్పు అని పిలిచి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వినయ్‌ ప్రధాన్‌ అనే కాంగ్రెస్‌ పార్టీ నేత తాజాగా కాంగ్రెస్‌ను పూర్తిగా వదిలేశారు. తాను పార్టీలో నుంచి వైదొలుగుతున్నానని, తాను త్వరలో పప్పు విముక్త(రాహుల్‌గాంధీ విముక్త) భారతం అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. కాంగ్రెస్‌ విముక్త భారతం అని బీజేపీ ఇచ్చిన నినాదం మాదిరిగానే అతడు పప్పు ముక్త్‌ భారత్‌ అనే నినాదంతో విస్తృత ప్రచారం చేస్తానని తెలిపారు. వినయ్‌ ప్రధాన్‌ కాంగ్రెస్‌ పార్టీలో 22 ఏళ్లుగా పనిచేశాడు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీని వీడిన ఆయన బీజేపీలో చేరుతారా లేక మరింకేదైనా పార్టీలోనా అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. అంతేకాదు.. పప్పు విముక్త భారతం అనే నినాదంతో ఆయన ఏ విధంగా ముందుకు వెళతారో అనే విషయాన్ని కూడా వివరించలేదు. అయితే, కాంగ్రెస్‌ పార్టీలోని పలువురు నేతలు తన లక్ష్యం కోసం సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాహుల్‌గాంధీ చుట్టూ సైకోలో ఉన్నారని తీవ్రంగా విమర్శించిన ఆయన వారి ద్వారానే త్వరలో కాంగ్రెస్‌ విముక్తి భారత్‌ కూడా సాధ్యమవుతుందని తెలిపారు. వినయ్‌ ప్రధాన్‌ మీరట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement