'కాంగ్రెస్ ఇంకా గుణపాఠం నేర్చుకోలేదు'
సభలో లో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన తీరు బాధ కలిగిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ఎం వెంకయ్య నాయుడు అన్నారు
న్యూఢిల్లీ: సభలో లో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన తీరు బాధ కలిగిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. గత లోకసభ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోలేదని వెంకయ్య విమర్శించారు. సభా కార్యక్రమాలను సజావుగా సాగనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుతగులుతోందని వెంకయ్య ఆరోపించారు. స్పీకర్ పై ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఒత్తిడికి గురిచేయాలని ఉద్దేశం చేసే చీప్ ట్రిక్కులు సరికావని ఆయన అన్నారు.
బుధవారం ఉదయం ప్రారంభమైన సభలో మత హింస బిల్లుకు ప్రతిపక్ష పార్టీలు అడ్డుతగలడంతో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్ లోకి వచ్చి నిరసన తెలిపారు. పరిస్థితులు అదుపుతప్పడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు.