రూ.2 కోట్ల కొకెన్ పట్టివేత | Cocaine Capture in bangalore | Sakshi
Sakshi News home page

రూ.2 కోట్ల కొకెన్ పట్టివేత

Apr 3 2016 8:02 PM | Updated on Sep 3 2017 9:08 PM

కర్ణాటకలోని బెంగళూరు గ్రామీణ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన ఐదు కిలోల కొకైన్‌ను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు.

బెంగళూరు(బనశంకరి): కర్ణాటకలోని బెంగళూరు గ్రామీణ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన ఐదు కిలోల కొకైన్‌ను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. హొసకోటె సమీపంలోని తోరవనహళ్లి వద్ద దాబా సమీపంలో కొకైన్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.

జిల్లా ఎస్పీ రమేష్‌బానోత్ ఆదేశాల మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. హొసకోటె తాలూకాకు చెందిన దివాకర్, రామాంజనప్ప, నరసింహమూర్తి, రాజేశ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి... కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement