కరుణానిధి అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌

CM KCR will Go To Chennai For Karunanidhi Funeral - Sakshi

సాక్షి, చెన్నై : డీఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి(94) మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. భారత రాజకీయా రంగానికి కరుణానిధి మరణం తీరని లోటు అన్నారు.సామాన్య మానవులు రాజకీయ అవగాహన కలిగించిన కొద్దిమంది నేతల్లో కరణానిధి ఒకరని పేర్కొన్నారు. కాగా, కరుణానిధి అంత్యక్రియలు బుధవారం జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు చెన్నై వెళ్లనున్నారు. కరుణానిధి అంత్యక్రియల్లో ఆయన పాల్గొననున్నారు.

తమిళనాడుకు తీరని లోటు: గవర్నర్‌
కరుణానిధి మృతిపట్ల తెలుగు రాష్ట్రాల  గవర్నర్‌ నరసింహన్‌ సంతాపం ప్రకటించారు. కరుణానిధి  మృతి దేశానికి, తమిళనాడుకు తీరని లోటని పేర్కొన్నారు. కరుణానిధి కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

దేశం ఒక రాజకీయ యోధుడిని కోల్పోయింది : చంద్రబాబు
తమిళనాడు రాజకీయాలని కొన్ని దశాబ్దాలపాటు శాసించిన కరణానిధి మరణం  దేశానికి తీరని లోటని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కరుణానిధి మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. బుధవారం చెన్నైలో జరగనున్న కరుణానిధి అంత్యక్రియల్లో ఆయన పాల్గొననున్నారు.

కరుణానిధి మృతిపట్ల జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, ఏపీ కాంగ్రెస్‌ నాయుకుడు రఘువీరారెడ్డి, తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య, మంత్రి హరీశ్‌ రావు, కేటీఆర్‌, లోకేశ్‌లు విచారం  వ్యక్తం చేశారు. కరుణానిధి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. కరుణానిధి కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top