ఆ సీఎంకు మాజీ సీఎం క్లాస్‌ | Chouhan Says Kamal Nath Shows His Narrow Mindset | Sakshi
Sakshi News home page

ఆ సీఎంకు మాజీ సీఎం క్లాస్‌

Jun 21 2019 2:59 PM | Updated on Jun 21 2019 3:00 PM

Chouhan Says Kamal Nath Shows His Narrow Mindset - Sakshi

కమల్‌ నాథ్‌పై చౌహాన్‌ మండిపాటు

భోపాల్‌ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ హాజరు కాకపోవడాన్ని మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తప్పుపట్టారు. యోగ చేయడం​ద్వారా రాష్ట్ర ప్రజలు, యువత ఫిట్‌గా ఉండేలా ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌జీ ప్రోత్సహించి ఉండాల్సిందని చౌహాన్‌ వ్యాఖ్యానించారు. కేవలం అధికార యంత్రాంగాన్ని నడిపించడం ఒక్కటే సీఎం పని కాదని, రాష్ట్రానికి ఓ దశా-దిశను నిర్ధేశం చేయాల్సిన గురుతర బాధ్యత ఆయనపై ఉందని అన్నారు.

యోగ కార్యక్రమంలో పాల్గొనకుండా ఆయన తన సంకుచిత మనస్తత్వాన్ని వెల్లడించారని చౌహాన్‌ ఆక్షేపించారు. భోపాల్‌లోని లాల్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఏర్పాటు చేయకపోవడం పట్ల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని ఏ ఒక్క పార్టీకో చెందిన వ్యక్తి కాదని, దేశ ప్రజలందరికీ ఆయన ప్రధాని అని విపక్షం అర్దం చేసుకోవాలని చురకలు వేశారు. ప్రధాని మోదీ చొరవతోనే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినం ప్రకటించిందని గుర్తుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement