సరిహద్దులో సైన్యం, భారత్ లో జింపింగ్! | China army third incursion, Xi Jinpings arrival in India | Sakshi
Sakshi News home page

సరిహద్దులో సైన్యం, భారత్ లో జింపింగ్!

Sep 21 2014 4:08 PM | Updated on Aug 15 2018 2:20 PM

సరిహద్దులో సైన్యం, భారత్ లో జింపింగ్! - Sakshi

సరిహద్దులో సైన్యం, భారత్ లో జింపింగ్!

నోటితో పిలిచి నొసటితో వెక్కిరించినట్టు ఉంది చైనా విదేశాంగ విధానం. , భారత ద్వైపాక్షిక సంబంధాలు.

నోటితో పిలిచి నొసటితో వెక్కిరించినట్టు ఉంది చైనా విదేశాంగ విధానం. , భారత ద్వైపాక్షిక సంబంధాలు. భారత్ దేశంలో చైనా సంబంధాలు ఎప్పుడూ వివాదస్పదంగానే కనిపిస్తాయి. నరేంద్రమోడీ కూడా చైనా విధానాన్ని ఊహించి ఉండకపోవచ్చు. భారత దేశంలో ఓ చైనా అధ్యక్షుడు పర్యటించడం ఇది మూడవసారి. చైనాతో విదేశాంగ విధానంపై ప్రధాని మోడీ మాట్లాడుతుండగానే ఆదేశ సైన్యం భారత భూభాగంలోకి చొచ్చుకురావడం మన దేశ సైన్యాధికారులను విస్మయానికి గురి చేస్తోంది. 
 
చైనా దేశ అధ్యక్షుడు జీ జింపింగ్ గుజరాత్ లో పర్యటిస్తుండగానే చైనా సైన్యం రెండుసార్లు మన భూభాగంలోకి ప్రవేశించాయి. గత పది రోజుల్లో భారత సైన్యం మన భూభాగంలోకి ప్రవేశించడం ఇది మూడోసారి. ఎన్నో దశాబ్దాలుగా వివాదంగా మారిన సరిహద్దు సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఊహాగానాలకు చైనా వెంటనే తెరదింపే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. చైనా దేశ విదేశాంగ విధానం ఏంటో ఈ ఘటన ద్వారా సంకేతాలిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement