కేరళలో పెరుగుతున్న బాల్యవివాహాలు | Child marriage on rise in Kerala: UNICEF | Sakshi
Sakshi News home page

కేరళలో పెరుగుతున్న బాల్యవివాహాలు

Aug 29 2014 10:42 AM | Updated on Sep 2 2017 12:38 PM

కేరళలో పెరుగుతున్న బాల్యవివాహాలు

కేరళలో పెరుగుతున్న బాల్యవివాహాలు

రళ రాష్ట్రం అనగానే దేశంలో సంపూర్ణ అక్షరాస్యత, అత్యధిక విద్యావంతులు గల రాష్ట్రం అంటూ టక్కున చెప్పేస్తాం.

కోల్కత్తా: కేరళ రాష్ట్రం అనగానే దేశంలో సంపూర్ణ అక్షరాస్యత, అత్యధిక విద్యావంతులు గల రాష్ట్రం అంటూ టక్కున చెప్పేస్తాం. కానీ అలాంటి రాష్ట్రంలో బాల్య వివాహాలు ఇటీవల కాలంలో అధికమవుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో కేరళ రాష్ట్రంలో బాల్య విహహాలు జరిగిన దాఖలాలు లేవు.... కానీ ప్రస్తుతం రాష్ట్రంలో బాల్య వివాహాలు సంఖ్య రోజురోజూకు పెరుగుతుందని భారత్లో యూనిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రత్యేక అధికారి దొర గీస్టీ వెల్లడించారు. దేశంలోని కొన్ని మతాలు, తెగలలో బాల్య వివాహాలు సర్వసాధారణమని ఆమె గుర్తు చేశారు.

అయితే దేశంలోని ఉత్తరాది ప్రాంతాల ప్రజలు దక్షిణాది రాష్ట్రాలకు వలస వస్తున్నారు. దాంతో కేరళకు వలస ప్రజల సంఖ్య మరింత పెరిగిందని చెప్పారు. దాంతో బాల్య వివాహాలు జరుగుతున్నాయని దోర గీస్టీ వివరించారు. సర్వే ప్రకారం బాల్య వివాహాలలో మొదటి స్థానం బీహార్ అక్రమించగా, చిట్ట చివరి స్థానాన్ని హిమాచల్ ప్రదేశ్ ఉందని చెప్పారు. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖాండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయని ఆమె తెలిపింది. పట్టణాలలో కంటే గ్రామాలలోనే బాల్యవివాహాల సంఖ్య అధికంగా జరుగుతుందని దోర గీస్టీ విశదీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement