‘భారతీయులు ఏం చెప్పినా నమ్మేస్తారు’ | Chidambaram said Indians Innocent Believe Anything | Sakshi
Sakshi News home page

వాళ్లంతా అమాయకులను ఎక్కడా చూడలేదు

Jan 11 2020 9:30 AM | Updated on Jan 11 2020 10:02 AM

Chidambaram said Indians Innocent Believe Anything - Sakshi

భారతీయులంతా అమాయకులను ఎక్కడా చూడలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అన్నారు.

ఢిల్లీ : భారతీయులంతా అమాయకులను ఎక్కడా చూడలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అన్నారు. శుక్రవారం ఓ కార్యక్రమానికి హాజరైన చిదంబరం మాట్లాడుతూ.. ‘నేను నా జీవితంలో భారతీయులంతా అమాయకులను ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. ఎవరేం చెప్పినా ఏమాత్రం ఆలోచించకుండా ప్రతి దానిని నమ్ముతాం. గ్రామాలన్నీ విద్యుదీపాలతో వెలిగి పోతున్నాయంటే నమ్ముతాం. దేశంలోని 99 శాతం కుటుంబాలకు టాయిలెట్లు నిర్మించారని చెబితే నమ్మేస్తాం’ అని కేంద్ర పథకాలను ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారని చిదంబరం విమర్శించారు

ఈ సందర్బంగా కేంద్ర పథకం ఆయుష్మాన్‌ భారత్‌పై ఆయన మండిపడ్డారు. ‘ఢిల్లీకి చెందిన నా డ్రైవర్‌ తండ్రికి ఆయుష్మాన్ భారత్‌ కింద సర్జరీ జరిగింది. అయితే అక్కడి వైద్యులు ఈ పథకం గురించి వారికి ఏం తెలియదని, ఇది వర్తించదని చెప్పారు. కానీ మనం ఆయుష్మాన్‌ దేశమంతా వర్తిస్తుందని, దీని ద్వారా అన్ని రోగాలకు వైద్యం చేయించుకోవచ్చని నమ్ముతాం. మనం అమాయకులం కదా. అనేక విషయాలకు సంబంధించిన వార్తలు, నివేదికలు అన్నీ వాస్తవానికి విరుద్దమే’ అని  కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో లోపాలను ఎత్తి చూపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement