ఎయిర్‌సెల్‌ మ్యా​క్సిస్‌ కేసులో చిదంబరానికి ఊరట

Chidambaram Got Releif In Aircell Maxis Case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో చిదంబరానికి సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. ఐఎన్‌ఎక్స్‌ కేసులో ఇప్పటికే అరెస్ట్‌ అయిన చిదంబరం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం​ ప్రత్యేక న్యాయస్ధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇదే కేసులో ఈడీ అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. చిదంబరంను ఈ కేసులో కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఈడీ దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు అంగీకరించింది. ముందస్తు బెయిల్‌ను ఓ హక్కుగా అందరికీ మంజూరు చేసే పరిస్థితి ఉండదని, ఆర్థిక నేరాలను భిన్నంగా చూడాల్సి ఉంటుందని, దర్యాప్తు తొలిదశలో ముందస్తు బెయిల్‌ జారీ చేస్తే దర్యాప్తు ప్రక్రియపై ప్రభావం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top