చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
రాయ్పూర్: చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రమణ్ సింగ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు సాంకేతికలోపం ఏర్పడింది. సోమవారం కుసుమా నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
హెలికాప్టర్ 4 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో అక్కడ నుంచి ఒకేసారి 150 అడుగుల కిందకు పడిపోయింది. కాగా పైలట్ వెంటనే హెలికాప్టర్ను నియంత్రించి సురక్షితంగా కిందకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.