ఇంట్లో మరుగుదొడ్డి కట్టించలేదని కన్న తండ్రిపై.. | Chennai Child Complained About Father For Toilet Construction | Sakshi
Sakshi News home page

ఇంట్లో మరుగుదొడ్డి కట్టించలేదని తండ్రిపై చిన్నారి ఫిర్యాదు

Dec 13 2018 8:56 AM | Updated on Dec 13 2018 8:57 AM

Chennai Child Complained About Father For Toilet Construction - Sakshi

ఫిర్యాదు చేసిన చిన్నారి హనిపా జార, చిన్నారి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మిస్తున్న దృశ్యం

మరుగుదొడ్డి నిర్మించాలని పలుమార్లు తండ్రి వద్ద తెలిపినా పట్టించుకోకపోవడంతో వారి బంధువుల సాయంతో...

వేలూరు: ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించని తండ్రిపై చర్యలు తీసుకోవాలని రెండవ తరగతి చదివే విద్యార్థిని గత సోమవారం ఉదయం ఆంబూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  వేలూరు జిల్లా రాజపురం వినాయకగుడి వీధికి చెందిన ఇసానుల్లా కుమార్తె హనిపా జార(7) అదే గ్రామంలోని ప్రవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతుంది. ఇంట్లో విద్యుత్‌ సరఫరా లేదు, మరుగుదొడ్డి లేదు. దీంతో కాలకృత్యాలకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని,  మరుగుదొడ్డి నిర్మించాలని పలుమార్లు తండ్రి వద్ద తెలిపినా పట్టించుకోకపోవడంతో వారి బంధువుల సాయంతో ఆంబూరులోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తండ్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసింది.  

దీంతో విషయం తెలుసుకున్న కలెక్టర్‌ రామన్‌ వెంటనే చిన్నారి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాలని ఆదేశించారు. దీంతో ఆంబూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్చభారత్‌ పథకం కింద మరుగుదొడ్డి నిర్మించే పనులు మంగళవారం ఉదయం ప్రారంభించారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు చిన్నారిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement