
న్యూఢిల్లీ : 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా గృహ రుణాలపై వడ్డీ రాయితీలు ప్రకటించగా.. ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాల ధరలు తగ్గనున్నట్లు పేర్కొన్నారు. రూ. 45 లక్షల ఇల్లు కొంటే రూ. 3.5 లక్షల మేర వడ్డీ రాయితీ కల్పిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా హోంలోన్ తీసుకున్న వారికి మరో లక్షన్నర వడ్డీ రాయితీ ఉంటుందని ప్రకటించారు. ఇక ప్రస్తుత బడ్జెట్ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, బంగారం ధరలు భారీగానే పెరుగనున్నాయి.
ధరలు తగ్గేవి
- ఎంపిక చేసిన కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు
- ఎలక్ట్రిక్ బైకులు
- డిఫెన్స్ ఎక్విప్‌మెంట్
ధరలు పెరుగనున్న వస్తువులు ఇవే..
- జీడిపప్పు, సబ్బులు, ప్లాస్టిక్ ఫ్లోర్ కవర్లు
- రబ్బరు, టైర్లు, న్యూస్ ప్రింట్, మ్యాగజైన్లు
- ఇంపోర్టెడ్, ప్రింటెడ్ పుస్తకాలు
- ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు
- సెరామిక్ టైల్స్, గోడకు అంటించే టైల్స్
- స్టెయిన్‌లెస్ స్టీల్, అలాయ్ స్టీల్ వైర్
- మెటల్ ఫర్నీచర్, మెటల్ రోడ్లు, కిటికీలు
- ఏసీలు, స్టోన్ క్రషింగ్ ప్లాంట్లు
- సీసీ కెమెరాలు, స్పీకర్లు, చార్జర్లు, డిజిటల్ వీడియో రికార్డర్లు
చదవండి : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్