ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి బొజ్జల రామకృష్ణారెడ్డిని పరామర్శించారు.
తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం మంత్రి బొజ్జల రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. ఇటీవల బొజ్జల తండ్రి మరణించిన సంగతి తెలిసిందే. రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఉదయం రేణిగుంట చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీకాళహస్తి మండలం ఊరందూరుకు వెళ్లి మంత్రి బొజ్జల కుటుంబానకి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మరికాసేపట్లో ఢిల్లీకి
సీఎం చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరనున్నారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రులను కలుస్తారు. గురువారం సాయంత్రం ప్రధానితో భేటీ అవుతారు. పునర్విభజన హామీల అమలు, రాజధాని భూసమీకరణపై ప్రధానితో చర్చిస్తారు. మధ్యాహ్నం కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్, ఉమాభారతి, రాధామోహన్తో భేటీ అవుతారు. శుక్రవారం అరుణ్ జైట్లీ, సురేష్ ప్రభు, నితిన్ గడ్కరీలతో భీటీ కానున్నారు.