రిటైల్‌ షాపులకు వారాంతపు సెలవుల్లేవు | Centre cancels no holidays for retail shops | Sakshi
Sakshi News home page

రిటైల్‌ షాపులకు వారాంతపు సెలవుల్లేవు

Apr 27 2017 1:41 AM | Updated on Sep 5 2017 9:46 AM

రిటైల్‌ షాపులకు వారాంతపు సెలవుల్లేవు

రిటైల్‌ షాపులకు వారాంతపు సెలవుల్లేవు

రాష్ట్రంలోని రిటైల్‌ షాపులకు వారంలో ఒక రోజు సెలవు ప్రకటించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రిటైల్‌ షాపులకు వారంలో ఒక రోజు సెలవు ప్రకటించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గతంలో వారానికి ఒక రోజు సెలవు ప్రకటించాలని నిర్ణయం తీసుకోగా, తాజాగా ప్రస్తుతం అమలులో ఉన్న వారం రోజులు పని చేసే నిబంధననే మరో రెండేళ్లు పొడిగిస్తూ ఆదేశాలి చ్చింది. ఈమేరకు బుధవారం కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కార్మికుల నిబంధనల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. రోజుకు ఎనిమిది గంటల చొప్పున, 48 గంటలు పని పూర్తి చేసిన వారికి తప్పనిసరిగా వారాంతపు సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement