పటేల్‌ జయంతిని ఘనంగా జరపండి: కేంద్రం

Centre asks states to observe birth anniversary of Sardar Vallabhbhai patel - Sakshi

న్యూఢిల్లీ: దేశ తొలి హోం శాఖ మంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతిని ఈ నెల 31న ఘనంగా నిర్వహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఆ రోజున రాజధాని ఢిల్లీలో ఉన్న సర్దార్‌ పటేల్‌ విగ్రహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం ‘ఐక్యతా పరుగు’ను ఆయన ప్రారంభిస్తారని ఓ అధికారి వెల్లడించారు.

‘సర్దార్‌ పటేల్‌ జయంతి రోజున ప్రతిజ్ఞ చేయించి, ఐక్యతా పరుగును నిర్వహించాల్సిందిగా హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులకు లేఖలు రాశారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులు పరుగులో పాల్గొనేలా చూడాలని రాజ్‌నాథ్‌ లేఖలో కోరారు’ అని ఆ అధికారి చెప్పారు. ఢిల్లీలో 1.5 కి.మీ. సాగే ఈ పరుగులో పీవీ సింధు, మిథాలీరాజ్‌ తదితర క్రీడా ప్రముఖులు పాల్గొననున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top