గవర్నర్ల రాష్ట్రేతర పర్యటనలపై కేంద్రం ఆంక్షలు విధించింది.
గవర్నర్ల రాష్ట్రేతర పర్యటనలపై కేంద్రం
న్యూఢిల్లీ: గవర్నర్ల రాష్ట్రేతర పర్యటనలపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఆయా రాష్ట్రాల్లోని గవర్నర్లు ఏడాదికి కనీసం 292 రోజులు ఉండాలని నిర్దేశించింది. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రేతర పర్యటనలకు వెళ్లాల్సి వస్తే రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు ఇష్టారీతిన రాష్ట్రం విడిచి వెళుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.
గవర్నర్ల రాష్ట్రేతర పర్యటనలకు సంబంధించి 18 నిబంధనలను కేంద్ర హోంశాఖ రూపొందించింది. దేశ, విదేశీ పర్యటనలకు వెళ్లాల్సి వస్తే వారం నుంచి ఆరువారాల ముందు రాష్ట్రపతి భవన్‌కు సమాచారమివ్వాలని, అత్యవసరంగా వెళ్తే అందుకు హేతుబద్ధ కారణాలను తెలపాల్సి ఉంటుందనే నిబంధన విధించింది. గవర్నర్లు కేలండర్ ఇయర్‌లో 20 శాతానికి మించిన రోజులు రాష్ట్రానికి వెలుపల గడపవద్దని సూచించింది.