వంట గ్యాస్, కిరోసిన్ ధరలను పెంచకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
పాట్నా: వంట గ్యాస్, కిరోసిన్ ధరలను పెంచకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ధరల పెంపు వల్ల ప్రజలపై పడే భారాన్ని పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. దీనివల్ల మధ్య తరగతి ప్రజలతో పాటు వంట కోసం కిరోసిన్ వినియోగించే పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
పెట్రోల్ ధరలు మాత్రం మార్కెట్‌కు అనుగుణంగా మారుతుంటాయని చెప్పారు. రూపాయి స్థిరంగా ఉన్నందున భవిష్యత్తులో పెట్రో ధరల పెంపు ఉండకపోవచ్చన్నారు. ఆదివారం ఆయన బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు.