గృహ హింసకు ఎర్ర చుక్క పరిష్కారం 

Central Government Give Solution Control Domestic violence On Women Over Lockdown - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రణ కోసం తీసుకొచ్చిన లాక్‌ డౌన్‌ లో ఇంట్లోనే ఉంటున్న ఆడవారిపైగృహ హింసకు పాల్పడుతున్న పురుషులను పట్టుకునేందుకు ఎర్ర చుక్క ఉపయోగపడుతోంది. అర చేతిలో రెడ్‌ డాట్‌ (ఎర్ర చుక్క)ను చూపిస్తూ మెయిల్‌ చేస్తే, బాధితురాలు ఉన్న ప్రాంతానికి పోలీసులు చేరుకునేలా వెఫ్ట్‌ అనే ఫౌండేషన్‌ ఈ పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ఎర్ర చుక్కను సోషల్‌ మీడియా ద్వారా గానీ, ఈ మెయిల్‌ ద్వారా గానీ చూపించడం లేదా 181 టోల్‌ ఫ్రీ నంబరుకు కాల్‌ చేయడం ద్వారా గానీ గృహ హింస జరుగుతోందని అధికారులకు తెలియజేయవచ్చని వెఫ్ట్‌ ఫౌండేషన్‌ ను ప్రారంభించిన రావత్‌ తెలిపారు. లాక్‌ డౌన్‌ సమయంలో కొందరు మహిళలకు బయటి కంటే ఇంట్లోనే ఎక్కువ ప్రమాదం దాగి ఉందని అభిప్రాయపడ్డారు. ఎర్ర చుక్క గుర్తును ప్రపంచ వ్యాప్తం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జాతీయ మహిళా కమిషన్, ఐరాస మహిళా విభాగంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. (లాక్‌డౌన్‌: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top