కళంకిత అధికారులపై వేటు

CBIC Compulsorily Retires Senior Officers On Corruption - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణలు సహా సీబీఐ వలలో చిక్కిన 22 మంది సీనియర్‌ అధికారులను కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) అనివార్యంగా పదవీవిరమణ చేయించింది. వేటుకు గురైన అధికారులంతా సూపరింటెండెంట్‌, ఏఓ స్ధాయి అధికారులు కావడం గమనార్హం. పన్ను చెల్లింపుదారులను వేధింపులకు గురిచేయడం, లంచాలు కోరడం వంటి పన్ను అధికారులపై చర్యలు తప్పవని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఎర్రకోట నుంచి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగానికి అనుగుణంగా అవినీతి, అధికార దుర్వినియోగం చేసే కళంకిత అధికారులపై చర్యలు చేపట్టినట్టు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అధికారుల అనుచిత వైఖరిని సహించేది లేదని తేల్చిచెప్పాయి. కాగా ఈ ఏడాది జూన్‌లో సీబీఐసీ అవినీతి మరకలంటిన 27 మంది అత్యున్నత ఐఆర్‌ఎస్‌ అధికారులపైనా వేటు వేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top